ఆనందం..మనందానంద౦..జగదానందం..సంగీతం

సుమధుర "మళయ"మారుతమిది. సుస్వర శాస్త్రీయ సంగీతానికి మళయ పదముల సొగసులద్దుతూ "దేవసభాతలానికి" స్వాగతం చెబుతూ మొదలై ఆనందం..మనందానంద౦..జగదానందం..సంగీతం అంటూ పూర్తయ్యే ఈ సుస్వరగీతం సుకర్ణామృతం. ఇది ఇద్దరు సంగీతవిద్వాంసుల మధ్య జరిగే సంగీతోత్సవం మనకు...వారికి పోటీకావచ్చు గాక :). 

ఈ సుస్వరగీతం ప్రత్యేకతలు 

౧) ఈ పాటను పాడిన ఇద్దరు గాయకులు.. అమృతగళ గాయకులు జేసుదాసు గారు  మరియు ప్రముఖ మళయసంగీతదర్శకులు రవిచంద్రన్ మాషు గారు. 


౨)జేసుదాసు గారు కర్నాటక సంప్రదాయంలో పాడితే రవిచంద్రన్ గారు హిందుస్తానీ సంప్రదాయంలో గళ గలగలలు 

౩)సంగీతసామ్రాజ్ఞి అయిన సరస్వతీదేవి కాలి గజ్జెలోని మువ్వల్లాంటి సప్తస్వరాలన్నింటినీ* ఇందులో సృజిస్తారు. 

౪) పాట చివరిలో కథానాయుకుడు శాస్త్రీయసంగీత౦లో అతిగొప్పదైన మరియు కష్టతరమైన "అసురతాళం" లో పాడి సంగీతవిభావరిలో గెలుస్తాడు. 



అసురతాళం ప్రత్యేకత అందులోని ప్రతీ అక్షరం దాని ముందు అక్షరం కన్నా ఎక్కువ/మంద్ర స్థాయిలో ఉంటుంది. అందువల్ల పాడడం చాలా కష్టమని ఉవాచ. సరస్వతీపుత్రుడు జేసుదాసు గారు  అసురతాళంలో పాడిన ఒకే ఒక్క గాయకుడిగా నేటివరకూ గినిస్ పుస్తకంలో తనపేరును ఘనంగా లిఖించుకున్నారు. 

మీరు ఈ "అసురతాళం" ని దృశ్య నిడివి 6:28 దగ్గర మొదలై 7:23 దగ్గర తారాస్థాయికి చేరుకొని 7:47 దగ్గర ముగియడాన్ని చూడగలరు.

అధ్బుతం..అజరామరం..ఈ సుస్వరం..ఎందరోమహానుభావులు... స్వరపరిచినవారందరికీ వందనాలు. 





* వికీ నుంచి : సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అని సప్త స్వరాలు (ఏడు స్వరాలు) ఉంటాయి. ఇవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషధ అనే పొడవైన పేర్లకు సంక్షిప్త రూపాలు. ఈ సప్త స్వరాలను అనేక రీతులతో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS